బీజేపీలో చేరిన మాజీ క్రికెట‌ర్‌

Ex Cricketer Dinesh Mongia Joins BJP Ahead Of Punjab Election. పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా

By Medi Samrat
Published on : 28 Dec 2021 3:47 PM IST

బీజేపీలో చేరిన మాజీ క్రికెట‌ర్‌

పంజాబ్ శాసనసభ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. మోంగియా ఈ రోజు ఢిల్లీలో కేంద్రంలోని అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో మోంగియా బీజేపీలో చేరారు. కీలకమైన పంజాబ్ ఎన్నికలకు ముందు పలువురు ప్రముఖులు పార్టీలో చేరారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. 'పంజాబ్‌లో బీజేపీ తన రెక్కలను విస్తరిస్తోందని ఇది తెలియజేస్తోంది. దీంతో ప్రతిపక్షాలన్నీ ఉత్కంఠగా ఉన్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండా మాతో పొత్తును ప్రకటించారు' అని షెకావత్‌ తెలిపారు.



Next Story