ఈవీఎం బ్యాటరీ గురించి ఎన్నికల సంఘం చెబుతోంది ఇదే.!

కాలిక్యులేటర్‌లకు ఉండే బ్యాటరీ ఈవీఎంలకు కూడా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది

By Medi Samrat  Published on  15 Oct 2024 7:53 PM IST
ఈవీఎం బ్యాటరీ గురించి ఎన్నికల సంఘం చెబుతోంది ఇదే.!

కాలిక్యులేటర్‌లకు ఉండే బ్యాటరీ ఈవీఎంలకు కూడా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. పేజర్ల లాగా ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయవచ్చన్న వాదనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. హర్యానాలోని వివిధ పోలింగ్ స్టేషన్‌లలో వివిధ EVM బ్యాటరీ స్థాయిల్లో మార్పులు కనిపించాయని కాంగ్రెస్ ఆరోపించింది. అదే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించిందని కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ ఈవీఎంల వినియోగాన్ని సమర్థించారు. ఈవీఎంలు ఖచ్చితంగా సురక్షితమైనవి, పటిష్టమైనవని అన్నారు. ఓటర్ల ఎంపికల్లో తేడాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో కాలిక్యులేటర్ బ్యాటరీ లాంటి సింగిల్ యూజ్ బ్యాటరీ ఉంటుంది తప్ప మొబైల్స్ లో ఉండే బ్యాటరీ తరహా కాదని రాజీవ్ కుమార్ వివరించారు.

Next Story