పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.!

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఎంత వడ్డీ ఇస్తారు? దీనికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నిర్ణయించింది.

By Medi Samrat
Published on : 24 May 2025 5:55 PM IST

పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.!

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఎంత వడ్డీ ఇస్తారు? దీనికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ రేటును 8.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించారు. EPFO యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రభుత్వానికి 8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది.. దానిని ప్రభుత్వం ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి మీటింగ్‌లో EPFపై 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాలకు జమ చేయాలని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని 7 కోట్ల మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. వీరిలో జీతం డబ్బు EPFలో డిపాజిట్ చేయబడిన ఉద్యోగులు కూడా ఉన్నారు. మనం 2023-24 సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే.. ఆ సంవత్సరంలో కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మొత్తంపై వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.

Next Story