శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు

శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది

By -  Knakam Karthik
Published on : 20 Jan 2026 11:27 AM IST

National News, Kerala, Sabarimala, Gold Theft Case, Enforcement Directorate, Multi-State Raids

శబరిమల గోల్డ్ చోరీ కేసులో ఈడీ దూకుడు..3 రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు

శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది. ఈ కేసు క్రమంలో మంగళవారం మూడు రాష్ట్రాలలోని 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు ED అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (PMLA) కింద కేరళ, కర్ణాటక, తమిళనాడులలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఈ కేసులో ప్రధాన నిందితులు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావన్‌కోర్ దేవశ్వం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ కు సంబంధించిన ప్రాంతాల్లో, అలాగే వారి సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు జరిగాయి. మరోవైపు, ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా దర్యాప్తు చేస్తున్నది. మొత్తం మీద, SIT ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసింది, వీరందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఈ కేసులో మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టడానికి బంగారు తాపడాల పునరుద్ధరణ పనుల్లో భాగమైన ఇతర అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ అక్రమాలలో ముఖ్య పాత్రధారులు ఎ. పద్మకుమార్, మాజీ సభ్యుడు కె.పి. శంకరదాస్ ఉన్నారని, వారి హయాంలోనే ఈ దొంగతనాలకు బీజం పడినట్లు అధికారులు తెలిపారు. కాగా, కేరళ హైకోర్టు ఇటీవల SIT అధికారులకు ఆన్-సైట్ తనిఖీ నిర్వహించాలని ఆదేశించింది.

Next Story