భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్–నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా Special Intensive Revision (SIR) ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులను సెప్టెంబర్ 30లోపు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది.
ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు, పేరు సవరణ, మార్పులు, తొలగింపులు వంటి ప్రక్రియలు ఈ ప్రత్యేక సవరణలో భాగంగా జరుగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర వారీగా టైమ్‌లైన్ సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ఖచ్చితత్వం ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.