మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. MVA, మహాయుతి మధ్య ఎదురుదాడి జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్, ఇతర పార్టీల ఫిర్యాదులపై ఎన్నికల సంఘం మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై చర్యలు తీసుకుంది. ఎలక్షన్ కమీషన్ రష్మీని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే.. క్యాడర్‌లోని తదుపరి సీనియర్ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. మహారాష్ట్ర డీజీపీ నియామకం కోసం రేపు అంటే నవంబర్ 5 మధ్యాహ్నం 1 గంటలోపు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను పంపాలని కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
సమీక్షా సమావేశాలు, అసెంబ్లీ ఎన్నికల ప్రకటనల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా విధులు నిర్వర్తించే సమయంలో పార్టీలకతీతంగా వ్యవహరించాలని సీఈసీ రాజీవ్ కుమార్ గతంలోనే అధికారులను హెచ్చరించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా వ్యవహరించడం లేదని.. అందుకే ఆమెను పదవి నుంచి తొలగించాలని రష్మీ శుక్లాపై కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రతిపక్షాల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం చివరకు కఠిన చర్యలు తీసుకుంది.