ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గానికి ఈసీ షాక్.. షిండే దే ‘అస‌లైన శివసేన’

Election Commission allots Shiv Sena name, bow and arrow symbol to Shinde faction. 'శివసేన' అనే పేరును, విల్లు, బాణం పార్టీ గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం అలాగే ఉంచుకోవాలని

By Medi Samrat  Published on  17 Feb 2023 7:15 PM IST
ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గానికి ఈసీ షాక్.. షిండే దే ‘అస‌లైన శివసేన’
'శివసేన' అనే పేరును, విల్లు, బాణం పార్టీ గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం అలాగే ఉంచుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం ప్రకటించింది. షిండే వర్గానికి మద్దతు ఉందని ఈసీ పేర్కొంది. జూన్ 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయ‌డంతో శివ‌సేన‌ పార్టీలో రెండు వర్గాలు ఉద్భవించాయి. ఉద్ధవ్ థాకరే, ఏకాంత్ షిండే మద్దతుదారులతో పార్టీ చీలిపోయింది. షిండే తిరుగుబాటు.. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని అధికారం నుండి దూరం చేసింది. ఉద్ధవ్ థాకరేను సిఎం కుర్చీ నుండి దింపేసింది. ఆ తర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా.. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంత‌రం ‘అస‌లైన శివసేన’ మాది అంటే మాది అంటూ ఇరువర్గాలు పరస్పరం విభేదించుకున్నాయి. అపుడే పార్టీ పేరు, గుర్తుపై ఇరువ‌ర్గాలు భారత ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అక్టోబర్ 2022లో.. ఎన్నికల సంఘం శివసేన విల్లు, బాణం గుర్తును స్తంభింపజేసింది. ఈసీ ఇరు వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక పేర్ల‌ను, గుర్తుల‌ను కేటాయించ‌గా.. థాక్రే దీనిని వ్య‌తిరేకించారు. ఈసీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ థాక్రే ఢిల్లీ హైకోర్టును సంప్ర‌దించ‌గా.. కోర్టు థాక్రే అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రించింది. ఈ త‌రుణంలోనే థాక్రే వ‌ర్గానికి షాక్ ఇస్తూ.. పార్టీ పేరును, విల్లు, బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయించింది.


Next Story