బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన ముగ్గురు ప్రముఖుల సీజ్ చేసిన ఆస్తుల నుండి రూ. 9 వేల కోట్లను బ్యాంకులకు ఈడీ ఈడీ బదిలీ చేసి షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా లకు సంబంధించిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకొంది. బ్యాంకులు ఎదుర్కొంటున్న మొత్తం నష్టాల్లో 80 శాతం అయిన రూ. 18,750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సగం ఆస్తులను బ్యాంకులకు కేంద్రానికి బదిలీ చేసింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా రూ. 9,371.17 కోట్ల విలువైన వాటాను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్టుగా ఈడీ బుధవారం నాడు తెలిపింది.
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసుల్లో సీజ్ చేసిన వేల కోట్ల ఆస్తులను ఆయా బ్యాంకులకు బదిలీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తాజాగా ఈ ముగ్గురి నుంచి సీజ్ చేసిన 8 వేల 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ వారు ముంచిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు బదిలీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 9 వేల 371 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బ్యాంకులకు ఇచ్చింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు మోసం చేసిన మొత్తం రూ. 22,585.83 కోట్లు కాగా.. వీటిలో రూ. 18,170 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జత చేసింది. ఇప్పటికే రూ.8,441 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకు బదిలీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 25న మరో రూ. 800 కోట్లను బదిలీ చేయాల్సి ఉంది. ఈ నెల 25 నాటికి షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 800 కోట్లు సంపాదించవచ్చని ఈడీ అంటోంది. ఈ ముగ్గురు కలిసి బ్యాంకులను మోసం చేసిన మొత్తం 22 వేల 586 కోట్ల రూపాయలలో 40 శాతాన్ని ఇప్పటి వరకు రికవరీ చేశారు.