ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తునకు సంబంధించి టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం నోటీసులు జారీ చేసింది. జూలై 21న వారిని విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను రెండు కంపెనీలు ప్రమోట్ చేస్తున్నాయని ED ఆరోపించింది. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేయబడిన ప్రకటనలు, వెబ్‌సైట్‌లకు గూగుల్, మెటా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.