కేజ్రీవాల్ కు దక్కని రిలీఫ్.. మళ్లీ జైలుకే..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు (జూన్ 2) తిరిగి తీహార్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.

By Medi Samrat  Published on  1 Jun 2024 10:45 AM GMT
కేజ్రీవాల్ కు దక్కని రిలీఫ్.. మళ్లీ జైలుకే..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు (జూన్ 2) తిరిగి తీహార్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై స్థానిక కోర్టు శనివారం ఉత్తర్వులను జూన్ 5 కి రిజర్వ్ చేసింది. వైద్య కారణాలతో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.

కేజ్రీవాల్ కు బెయిల్ కొనసాగించకూడదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విభేదించింది. కేజ్రీవాల్ వాస్తవాలను అణచివేసే అవకాశం ఉందని.. ఆయన తన ఆరోగ్యంతో సహా ఎన్నో విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని తెలిపింది. ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే అరవింద్ కేజ్రీవాల్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) లేదా ఇతర ఆసుపత్రికి తీసుకువెళతామని కూడా దర్యాప్తు సంస్థ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్‌కు గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. అది జూన్ 1న ముగుస్తుంది. జూన్ 2న (ఆదివారం) తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంటుంది.

Next Story