ముఖ్యమంత్రి డిప్యూటీ సెక్రెటరీ అరెస్ట్

ED arrests top bureaucrat in Chhattisgarh in coal extortion case. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది

By Medi Samrat  Published on  2 Dec 2022 1:45 PM GMT
ముఖ్యమంత్రి డిప్యూటీ సెక్రెటరీ అరెస్ట్

ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ డిప్యూటీ సెక్రెటరీ సౌమ్య చౌరాసియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా సహకరించారనే అభియోగాలను ఆమె ఎదుర్కొంటున్నట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సౌమ్య చౌరాసియాకు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేసింది. బొగ్గు గనుల్లో అక్రమ మైనింగ్ కు అనుమతుల వ్యవహారంపై గత రెండు నెలల్లో పలుమార్లు సౌమ్యను ప్రశ్నించిన ఈడీ తాజాగా అరెస్టు చేసింది. 2002 మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను అరెస్టు చేశామని.. రాష్ట్రంలోని పలు బొగ్గు గనుల్లో పరిమితికి మించిన స్థాయిలో మైనింగ్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఒక్కో టన్ను బొగ్గుపై అదనంగా 25 రూపాయలు పన్నును అక్రమంగా వసూలు చేశారని ఐటీ శాఖ అభియోగాలను దాఖలు చేసింది. పలువురు నాయకులకు ఇందులో భాగం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

గత రెండు నెలల్లో సౌమ్యను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి టన్ను బొగ్గుపై టన్నుకు రూ. 25 చొప్పున అక్రమంగా వసూలు చేసిన స్కామ్‌కు సంబంధించి ED మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 కింద సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి అరెస్టులు చేసింది. సీనియర్ బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు తెలిపారు.


Next Story