మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో దాడులు నిర్వహిస్తున్న ఈడీ బృందం శనివారం కీలక చర్యలు చేపట్టింది. ఐఏఎస్ అధికారి రాను సాహును ఈడీ బృందం అరెస్ట్ చేసింది. రాను సాహును అరెస్టు చేసిన తర్వాత.. రాయ్‌పూర్ కోర్టులో హాజరుపరిచారు. ఛత్తీస్‌గఢ్ బొగ్గు లెవీ స్కామ్‌లో ఈడీ ఈ చర్య తీసుకుంది. బొగ్గు కుంభకోణంలో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారి రాను సాహు. అంతకుముందు సమీర్ విష్ణోయ్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.
రాను సాహు 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. రాను సాహు చత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జన్మించింది. రాను సాహు భర్త పేరు జైప్రకాష్ మౌర్య. ఆయన మంత్రివర్గంలో కార్యదర్శి. రాను సాహుకు చిన్నప్పటి నుంచి పోలీసు యూనిఫాం అంటే చాలా ఇష్టం. చదువుకున్నప్పటి నుంచే పోలీస్ ఉద్యోగంలో చేరాలని భావించింది. ఈ క్రమంలోనే 2005లో రాను సాహు డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీ అయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. 2010లో యూపీఎస్సీకి ఎంపికై చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిగా సేవలు అందించారు. సాహూ ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్‌గా ఉన్నారు.