అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం
Ecstatic Indian-Americans Welcome PM Modi.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని
By తోట వంశీ కుమార్ Published on
23 Sep 2021 3:30 AM GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. పలువురు ఎన్నారైలు భారత జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. వంద మందికిపైగా ఎన్నారైలు విమానాశ్రయానికి వచ్చారు. తన కోసం వేచిఉన్నవారిని కలిసిన ప్రధాని వారికి కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు అమెరికాలో ప్రధాని పర్యటన కొనసాగనుంది.
మూడురోజుల పర్యటనలో భాగంగా.. తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం ఐక్యరాజ్య సమితి 76 వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘనిస్థాన్ అంశాలపై చర్చించనున్నారు. మూడు రోజుల పర్యటనను ముగించుకుని ఈ నెల 26న ప్రధాని స్వదేశానికి రానున్నారు.
Next Story