ముందుగా జైలు అన్నం తినండి.. మాజీ హోంమంత్రి అభ్యర్థనపై కోర్టు వ్యాఖ్య

Eat prison rice first .. Court comment on former Home Minister's request. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.

By అంజి  Published on  15 Nov 2021 10:08 AM GMT
ముందుగా జైలు అన్నం తినండి.. మాజీ హోంమంత్రి అభ్యర్థనపై కోర్టు వ్యాఖ్య

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా ముంబై కోర్టు అనిల్‌ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల పాటు జ్యుడిషీయల్‌ కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఇంటిని నుంచి భోజనం తెప్పించుకుంటానని, అందుకు అనుమతించాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ కోర్టును కోరారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ముందుగా జైలులో పెట్టే అన్నం తినాలి పేర్కొంది. ఒక వేళ జైలు అన్నం తినకలేకపోతే అప్పుడు మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు వ్యాఖ్యనించింది. తన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జైలులో ఒక బెడ్‌ ఏర్పాటు చేయాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ అభ్యర్థించగా.. కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. జైలులో ఆయనకు కేటాయించిన గదిలో బెడ్‌ ఏర్పాటు చేయనున్నారు జైలు అధికారులు.

నవంబర్‌ 2వ తేదీన అనిల్‌ దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. ముంబైలోనీ ఈడీ కార్యాలయంలో దాదాపు 12 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మంత్రి పదవికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్‌ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేయగా అనిల్‌ దేశ్‌ముఖ్‌ విచారణకు హాజరుకాలేదు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున అనిల్ దేశ్ ముఖ్ పై వ్యతిరేకత రావడంతో అనిల్ దేశ్ ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Next Story