రాజస్థాన్ లో భారీ భూకంపం

Earthquake of Magnitude 5.3 on the richter scale hit bikaner rajasthan.రాజస్థాన్ భారీ భూకంపం సంభవించింది. రిక్డ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 21 July 2021 10:24 AM IST

రాజస్థాన్ లో భారీ భూకంపం

రాజస్థాన్ భారీ భూకంపం సంభవించింది. రిక్డ‌ర్ స్కేల్‌పై ప్ర‌కంప‌న‌ల తీవ్ర‌త 5.3గా న‌మోదు అయిన‌ట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. ఈ రోజు ఉద‌యం 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. నిద్ర‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో.. జనాలు హడలిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు పరుగులు తీశారు. కాగా.. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం నమోదైన భూకంప తీవ్రతకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని భూకంప అధ్యయన కేంద్రం అధికారులు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రం మేఘాల‌యాలోనూ భూకంపం సంభ‌వించింది. రాత్రి 2.10 నిమిషాల‌కు భూమి కంపించిన‌ట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది. మేఘాల‌య ప‌శ్చిమ ప్రాంతంలోని గ్యారో హిల్స్‌లో ఈ ప్ర‌కంప‌న‌లు న‌మోదైన‌ట్లు పేర్కొంది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4.1గా న‌మోదైన‌ట్లు వివ‌రించింది. స‌రిగ్గా రెండున్న‌ర గంట‌ల త‌రువాత ల‌డ‌క్‌లో కూడా భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్ పై దీని తీవ్ర‌త 3.6గా న‌మోదైంది.

Next Story