హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

Earthquake of magnitude 4.1 hits Himachal Pradesh.హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2022 9:31 AM IST
హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. బుధ‌వారం రాత్రి 9.32 గంట‌ల స‌మ‌యంలో భూ కంపం సంభ‌వించిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.1గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. మండీకి వాయువ్యంగా 27 కిలోమీట‌ర్ల దూరంలో భూ కంప కేంద్రం ఉన్న‌ట్లు చెప్పింది. కాగా.. ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. గత పక్షం రోజులుగా హిమాలయ ప్రాంతంలో వరుస భూకంపాలు సంభవించాయి. ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దులో ఉన్న హిమాలయ ప్రాంతంలో నవంబర్ 8 నుంచి 16 మధ్య కనీసం 10 భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ డేటా చూపించింది. ఈ నెల 14న పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌, అంక ముందు ఢిల్లీలో రెండు సార్లు భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి.

Next Story