మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల నాసిక్‌కు పశ్చిమాన 89 కిలో మీటర్లలో భూమికి 5కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. కాగా.. ఈ భూ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. కొన్ని వారాల క్రితం ఆగస్టు 16న రాత్రి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రకంపనలు కనిపించాయి.