ఉత్త‌ర‌కాశీ, నేపాల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

Earthquake of magnitude 3.1 strikes Uttarkashi in Uttarakhand.ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని ఉత్త‌ర‌కాశీలో భూ ప్ర‌కంప‌న‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Dec 2022 3:04 AM GMT
ఉత్త‌ర‌కాశీ, నేపాల్‌లో భూ ప్ర‌కంప‌న‌లు

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని ఉత్త‌ర‌కాశీలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 2.19 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.1గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. మ‌ధ్య‌రాత్రి భూమికంపించ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

నేపాల్‌లో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు సార్లు

నేపాల్ దేశాన్ని భూకంపాలు వ‌ణికించాయి. గంట వ్యవ‌ధిలో రెండు సార్లు భూమి కంపించింది. బాగ్‌లంగ్‌ జిల్లాలో చౌరు ప్రాంతంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 1.23 గంట‌ల‌కు భూమి కంపించింద‌ని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (NEMRC) తెలిపింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 4.7గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది.

గంట వ్య‌వ‌ధిలో మ‌రో భూకంపం సంభ‌వించిన‌ట్లు చెప్పింది. బాగ్‌లంగ్‌ జిల్లా ఖుంగాలో తెల్లవారుజామున 2.07 గంటల స‌మ‌యంలో 5.3 తీవ్రతతో భూ ప్ర‌కంప‌లు వ‌చ్చిన‌ట్లు పేర్కొంది.

కాగా.. గంట వ్య‌వ‌ధిలో వ‌చ్చిన ఈ రెండు ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఆస్తి, ప్రాణ న‌ష్టానికి సంబంధించి ఎలాంటి స‌మాచారం ఇంకా అంద‌లేద‌ని చెప్పింది.


Next Story