కర్ణాటక రాజధాని బెంగళూరులో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.14 గంటలకు ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయిని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.3గా నమోదు అయినట్లు వెల్లడించింది. భూమికి 23 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. ఇక భూప్రకంపనలతో ఉలిక్కిపడిన ప్రజలు.. ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.