నాగాలాండ్, అస్సాంలో భూకంపం.. తీవ్రత ఎంతంటే..?
Earthquake in Nagaland.ఈశాన్య రాష్ట్రాల ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా అసోం, నాగాలాండ్
By తోట వంశీ కుమార్ Published on 15 May 2021 7:33 AM GMT
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా అసోం, నాగాలాండ్, మిజోరాం వంటి ప్రాంతాల్లో వరుస భూకంపాలు కలవరపెడుతున్నాయి. మార్చి నెలలో ఓ సారి భారీ భూకంపం సంభవించగా.. తాజాగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు ఉదయం 8:32 గంటలకు నాగాలాండ్‌లోని లాంగ్లెంగ్ జిల్లాలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.
మోకోక్చుంగ్‌కు తూర్పున 74 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5 గంటలకు భూ ప్రకంపణలు వచ్చాయనని చెప్పింది. భూకంప కేంద్రాన్ని 81 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది. ఈ తీవ్రతకు అక్కడి నివాసాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ ఏ ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు పేర్కొన్నారు. అలాగే అసోంలోని తేజ్‌పూర్‌లో సైతం ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది. తేజ్‌పూర్‌కు 41 కిలోమీటర్ల దూరంలో, భూమికి 16కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.