అస్సాంలో భూకంపం..

Earthquake in assam.రిక్టర్ స్కేల్‌పై 6.4 గా నమోదైన భూకంపం అస్సాం, ఉత్తర బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాలలో ప్రకంపనలు సృష్టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 3:34 AM GMT
Earthquake

భారీ భూకంపం బుధవారం ఉదయం ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 గా నమోదైన భూకంపం అస్సాం, ఉత్తర బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాలలో ప్రకంపనలు సృష్టించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం అస్సాంలోని తేజ్‌పూర్‌ కు పశ్చిమాన 43 కిలోమీటర్ల దూరంలో మొదలైంది. మొదటి ప్రకంపన ఉదయం 7:51 గంటలకు నమోదైంది. తరువాత మరో రెండు ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. ఒకటి ఉదయం 7:55 గంటలకు మరియు మరొకటి ఇంక కొన్ని నిమిషాల వ్యవధిలో సంభవించినట్టు సమాచారం. తరువాత జరిగిన రెండు జర్క్ లు రిక్టర్ స్కేల్‌పై ర 4.3 మరియు 4.4 గా ఉన్నాయి. భారీ భూకంపం తరువాత అస్సాంలోని పలు భవనాలలో పగుళ్లు కనిపించాయి.

అస్సాం, ఉత్తర బెంగాల్ స్థానికులు గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు సోషల్ మీడియా లో వెల్లడించారు. భూకంపం గురించి ట్వీట్ చేసిన వారిలో అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఉన్నారు. భూకంపం కనీసం 30 సెకన్ల పాటు జరిగి ఉండవచ్చు అని, ఇది 29 కిలోమీటర్లు అంటే 18 మైళ్ళు లోతులో సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా గౌహతిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.





Next Story