మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. కొల్హాపూర్‌కు 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూమి లోపల 5 కి.మీ లోతున ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంపం సంభవించడంతో నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగర వాసులు భయాందోళనకు గురైయ్యారు. అక్కయ్యపాలెం, బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్లపాలెం, అడవివరం, గోపాలపురం, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఉదయం 7.15 గంటల సమయంలో భారీ శబ్దాలు కూడా వినిపించాయని అక్కడి స్థానికులు అన్నారు.