శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ (CIK) విభాగం కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో 12 ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద నేరాలకు సంబంధించిన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా ఉగ్రవాదాన్ని మహిమాపరచడం, యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించి నియామకం చేయాలన్న ఉద్దేశంతో సాగుతున్న కార్యకలాపాలపై ఈ దాడులు కేంద్రీకృతమయ్యాయని అధికారులు వెల్లడించారు.
ఈ చర్యలు FIR నం. 03/2023 కింద నమోదు చేసిన కేసులో భాగంగా చేపట్టినవని, సంబంధిత కోర్టుల నుంచి ముందస్తుగా సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరమే దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోదాల సందర్భంగా డిజిటల్ పరికరాలు, పత్రాలు సహా కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.