మద్యం మత్తులో హోలికా దహనం మంటల్లోకి వెళ్లిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో హోలీ వేడుకల సందర్భంగా ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది.

By -  Medi Samrat
Published on : 5 March 2026 9:10 PM IST

మద్యం మత్తులో హోలికా దహనం మంటల్లోకి వెళ్లిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో హోలీ వేడుకల సందర్భంగా ఒక విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మంటల మధ్యలో నిలబడటం చూసి అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంభల్ జిల్లాలోని గున్నౌర్ తహసీల్ పరిధిలోని నందరౌలి గ్రామంలో హోలికా దహనం వేడుకల సమయంలో జరిగింది. సంప్రదాయం ప్రకారం గ్రామంలో పెద్ద ఎత్తున మంటలు వేసి, గ్రామస్తులందరూ పూజలు చేస్తూ, మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మండుతున్న హోలికా దహనం మంటల్లోకి నేరుగా నడిచి వెళ్ళాడు. మంటల మధ్యలో నిలబడి ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ప్రవర్తించడంతో అక్కడున్న వారంతా భయపడ్డారు.

ఇది గమనించిన కొందరు గ్రామస్తులు వెంటనే కేకలు వేసి అలర్ట్ చేశారు. మంటల దగ్గర ఉన్న యువకులు వెంటనే స్పందించి, ప్రాణాలకు తెగించి మంటల్లోకి వెళ్ళి ఆ వ్యక్తిని బయటకు లాక్కొచ్చారు. ఎటువంటి గాయాలు అయినట్లు కూడా అధికారికంగా సమాచారం లేదు.

Next Story