శరత్‌కుమార్ ఆరోగ్యంపై వ‌దంతులు

Dont Believe Gossips On R Sarathkumar Health Says His Pr Team. ప్రముఖ సినీ నటుడు ఆర్‌ శరత్‌కుమార్ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  11 Dec 2022 8:53 PM IST
శరత్‌కుమార్ ఆరోగ్యంపై వ‌దంతులు

ప్రముఖ సినీ నటుడు ఆర్‌ శరత్‌కుమార్ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శరత్‌కుమార్‌ చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని ఆయన పీఆర్ టీం అప్‌డేట్ అందించింది. శరత్‌కుమార్‌ వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యం తో చెన్నైలోని నివాసానికి చేరుకున్నారని, అభిమానులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం విజ్ఞప్తి చేసింది.

డీ హైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైన శరత్‌కుమార్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లినట్టు వార్తలు హల్‌ చల్ చేస్తుండటంతో.. అభిమానులు ఆందోళన చెందకుండా పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది పీఆర్ టీం. ఇక తమ అభిమాన నటుడు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించి భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆర్ శరత్‌కుమార్‌. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. విజయ్‌ నటిస్తున్న వారసుడు చిత్రంలో కీలక పాత్రలో నట్తిస్తున్నాడు.


Next Story