లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశాక డింపుల్ యాదవ్ చేసిన పనికి అందరూ షాక్..!

Dimple Yadav touches Sonia Gandhi's feet. సమాజ్‌వాదీ పార్టీ దివంగత నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ సోమవారం

By M.S.R  Published on  12 Dec 2022 7:45 PM IST
లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేశాక డింపుల్ యాదవ్ చేసిన పనికి అందరూ షాక్..!

సమాజ్‌వాదీ పార్టీ దివంగత నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ సోమవారం లోక్ సభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. మెయిన్‌పురి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఆమె గెలుపొందారు. బీజేపీకి చెందిన రఘురాజ్ సింగ్ షాక్యాపై 2,88,461 ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి లోక్ సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆమె ప్రతిపక్ష బెంచీల్లో ముందు వరుసలో కూర్చున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గరకు వెళ్లారు. ఆమె పాదాలను తాకి నమస్కరించారు. చాలా ఏళ్లుగా ఆ నియోజకవర్గం నుంచి ములాయం సింగ్ గెలుపొందుతూ వస్తున్నారు. 1996లో అక్కడి నుంచి మొదటి సారిగా ఆయన పోటీ చేసి గెలు పొందారు. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటలా ఉన్న ఆ ప్రాంతంలో డింపుల్ యాదవ్ భారీ తేడాతో గెలుపొందారు.


Next Story