రామమందిర నిర్మాణానికి ఊహించని వ్యక్తి నుంచి రూ. లక్ష విరాళం!

Digvijaya Singh sends a cheque to PM Modi for the Ram temple. రామమందిర నిర్మాణానికి ఊహించని వ్యక్తి నుంచి రూ. లక్ష విరాళం.

By Medi Samrat  Published on  19 Jan 2021 2:45 PM GMT
Ram Mandir temple

ఎన్నో దశాబ్దాలుగా తెలుగువారి కల నెరవేరబోతున్న సమయం అని చెప్పవచ్చు. ఎన్నో సమస్యలను అధిగమించుకొని అయోధ్య రామమందిర నిర్మాణం చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి పెద్దపెద్ద రాజకీయ నాయకుల వరకు ఆలయ నిర్మాణానికి విరాళాలు ప్రకటిస్తూ ఉండడం విశేషం.

ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధమున్న, సీనియర్ కాంగ్రెస్ నేత రామమందిర నిర్మాణం ఆపాలని, బిజెపి హిందువుల పార్టీ అని ఒకప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన డిగ్గీ రాజాగా పేరొందిన దిగ్విజయ్‌ సింగ్‌ ఎవరూ ఊహించని విధంగా ప్రస్తుతం రామమందిర నిర్మాణానికి రూ. లక్ష 11 వేల111 రూపాయలను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విధంగా రామ మందిరానికి విరాళం ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

దిగ్విజయ్‌ సింగ్‌ రాసిన లేఖలో తాను మత కలహాలకు వ్యతిరేకం కానీ... ఆలయ నిర్మాణానికి మాత్రం కాదని దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టంగా ఆ లేఖలో తెలియజేశారు. ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్ రామ మందిరానికి ప్రకటించిన విరాళం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి విశ్వహిందూ పరిషత్ 44 పాటు విరాళాలను సేకరణ మొదలు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో మంది ప్రముఖులు సినీ సెలబ్రిటీలు సైతం విరాళాలు ప్రకటించడం ఎంతో విశేషం. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా విస్తృతస్థాయిలో రామ మందిరానికి విరాళాలు అందుతున్నాయని చెప్పవచ్చు.


Next Story
Share it