ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ప్రమాదంపై దిగ్విజయ్ విచారం వ్యక్తం చేస్తూ.. రైలు భద్రతకు సంబంధించి ప్రభుత్వం అనేక వాదనలు చేసిందని.. అవన్నీ బూటకమని నిరూపిస్తున్నాయని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రధాని మోదీ రాజీనామా చేస్తారని మేం ఆశించడం లేదని.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఇలాంటి రైలు ప్రమాదం జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసిన సందర్భం ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ వద్ద బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.