దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఆ AQI 1000 కంటే ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఆరోగ్య సలహాదారులు బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇంటి నుండి బయటకు వెళ్లకుండా మాస్క్ ధరించాలని సలహా ఇస్తున్నారు.
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోవడం అంటే రెండు పెట్టెల సిగరెట్లు తాగినంత పని. దేశ రాజధానిలో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొంది. అక్కడ AQI 1023 వద్ద ఉంది. ఇది ఒక వ్యక్తి రోజుకు 49 సిగరెట్లు తాగడానికి సమానం. వైద్యులు కాలుష్యం చాలా పెరిగిందని.. N95 మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని.. ఇంకా సర్జికల్ లేదా క్లాత్ మాస్క్‌లు ధరించరాదని తెలిపారు. ఈ పరిస్థితిలో N95 మాస్క్ ఒక మంచి పరిష్కారంగా చెబుతున్నారు.
ఢిల్లీలోని మందిర్ మార్గ్ ప్రాంతంలో సాయంత్రం 4.30 గంటలకు ఏక్యూఐ 1063 నమోదైంది. ముండ్కాలో 1023, గురుగ్రామ్‌లోని ఆర్య నగర్‌లో 1023, జహంగీర్‌పురిలో 1003, పంజాబీ బాగ్‌లో 911 AQI నమోదైంది. న్యూఢిల్లీలో ఏక్యూఐ 805గా నమోదైంది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో AQI ప్రమాదకర స్థాయిలో ఉంది.