ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతూ ఉండగా.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతుడు బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ అని తెలిపింది. 259.67 కోట్ల విలువైన ఆస్తులతో, షకుర్ బస్తీ నుంచి పోటీ చేస్తున్న కర్నైల్ సింగ్ 699 మంది పోటీదారుల జాబితాలో అత్యంత ధనికుడిగా అగ్రస్థానంలో ఉన్నారు.
రాజౌరీ గార్డెన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీకి చెందిన మంజీందర్ సింగ్ సిర్సా 248.85 కోట్ల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 130.90 కోట్ల ఆస్తులతో కృష్ణ నగర్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గురుచరణ్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ రూ. 115.63 కోట్లతో నాలుగో స్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజౌరీ గార్డెన్ అభ్యర్థి ఎ. ధన్వతి చండేలా రూ. 100.90 కోట్లుతో 5వ స్థానాల్లో ఉన్నారు.