పండుగకు ముందే అక్కడ పెరిగిపోయిన వాయు కాలుష్యం

Delhi's Air Quality Turns "Very Poor" Day Ahead Of Diwali. దీపావళి పండుగ వచ్చిందంటే దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వాయుకాలుష్యం గురించి తీవ్ర చర్చ జరుగుతూ

By M.S.R  Published on  3 Nov 2021 12:34 PM IST
పండుగకు ముందే అక్కడ పెరిగిపోయిన వాయు కాలుష్యం

దీపావళి పండుగ వచ్చిందంటే దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వాయుకాలుష్యం గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. పండుగ తర్వాత వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుందని చెబుతూ ఉంటారు. అలాగే గతంలో జరిగింది కూడానూ..! తాజాగా వాయు కాలుష్యం ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీపావ‌ళి పండుగ‌కు ముందే వాయు నాణ్య‌త క్షీణించిందని.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి తెలిపింది. పీఎం 2.5, పీఎం 10 కేట‌గిరీల్లో ఢిల్లీ వాయు నాణ్య‌త 252, 131గా ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ అధికారులు చెప్పారు. న‌వంబ‌ర్ 2, 3వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంద‌ని ఐఎండీ తెలిపింది. న‌వంబ‌ర్ 4వ తేదీన కూడా వెరీ పూర్ క్యాట‌గిరీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది.

5, 6వ తేదీల్లోనూ వాయు నాణ్య‌త క్షీణించినా వెరీ పూర్ క్యాట‌గిరీలోనే ఉంటుంద‌ని ఐఎండీ చెబుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో టపాసులపై నిషేధం విధించారు. ఢిల్లీలో బాణసంచా నిషేధం కారణంగా, వాటిని అమ్మినా లేదా కాల్చినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వం జనవరి 1, 2022 వరకు అన్ని రకాల టపాసుల అమ్మకం మరియు పేల్చడంపై పూర్తి నిషేధాన్ని విధించింది. ఢిల్లీ మాత్రమే కాకుండా ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా టపాసుల అమ్మకాలపై నిషేధం విధించాయి.


Next Story