4 అంతస్తుల భవనాన్ని.. రాహుల్‌గాంధీకి రాసిచ్చిన ఢిల్లీ మహిళ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దయిన తర్వాత.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు నోటీసు
By అంజి Published on 2 April 2023 6:33 AM GMT4 అంతస్తుల భవనాన్ని.. రాహుల్‌గాంధీకి రాసిచ్చిన ఢిల్లీ మహిళ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దయిన తర్వాత.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఒక మహిళ తన 4 అంతస్తుల ఇంటిని రాహుల్‌కు రాసిచ్చింది. ఢిల్లీ మహిళా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షురాలు రాజ్‌కుమారి గుప్తా ఢిల్లీలోని మంగోల్‌పురిలో ఉన్న తన ఇంటికి రాహుల్ గాంధీ పేరు పెట్టింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సమయంలో తనకు లభించిన ఇంటిని పార్లమెంటు మాజీ సభ్యుడు రాహుల్ గాంధీకి బదిలీ చేసింది. ''మోదీ జీ రాహుల్‌ని ఇంటి నుంచి వెళ్లగొట్టగలరని, అయితే ప్రజల హృదయాల నుంచి కాదు అని రాజ్‌కుమారి జీ అన్నారు'' అని కాంగ్రెస్ సేవాదళ్ ఏప్రిల్ 1న హిందీలో చేసిన ట్వీట్‌లో తెలియజేసింది.
తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసు వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు సోషల్ మీడియాలో 'మేరా ఘర్, ఆప్కా ఘర్' అంటూ ప్రచారం ప్రారంభించారు. ఇందులోభాగంగా రాహుల్ మద్దతుదారులు తమ ఇళ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా ఇల్లు రాహుల్ గాంధీ ఇల్లు.. అని రాస్తున్నారు. 22 సెకన్ల వీడియోలో కాంగ్రెస్ నాయకురాలు కొన్ని అధికారిక కాగితాలను పట్టుకుని కనిపించారు. రాజ్‌కుమారికి దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్థుల ఇల్లు ఉంది.
दिल्ली महिला कांग्रेस सेवादल की अध्यक्ष श्रीमती राजकुमारी गुप्ता जी ने मंगोलपुरी इलाके में अपना घर श्री @RahulGandhi जी के नाम कर दिया है, उन्हें यह घर इंदिरा गांधी जी के समय मिला था।राजकुमारी जी बोलीं कि मोदी जी, राहुल जी को घर से निकाल सकते हैं, लेकिन लोगों के दिल से नहीं। pic.twitter.com/6wSx8mBhiv
— Congress Sevadal (@CongressSevadal) April 1, 2023
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు మార్చి 23న దోషిగా తేల్చింది. 2019 ఏప్రిల్‌లో కోలార్‌లో రాహుల్ ఇలా అన్నారు. ''దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకు?'' అని. అయితే ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా దాఖలు కావడవతో కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. అంతే కాదు రాహుల్ సభ్యత్వం పోయిన తర్వాత ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయాలని రాహుల్‌కు నోటీసులు అందాయి. బంగ్లాను ఖాళీ చేసేందుకు ఏప్రిల్ 22 వరకు గడువు ఇచ్చారు. రాహుల్ గాంధీ ఢిల్లీలోని లుటియన్స్ జోన్, తుగ్లక్ రోడ్ 12లోని ప్రభుత్వ నివాసంలో నివసిస్తున్నారు. రాహుల్ 2005 నుంచి ఈ బంగ్లాలో నివసిస్తున్నారు.