విమానం బాత్ రూమ్ లో "బాంబు" అని రాసిన టిష్యూ పేపర్

మంగళవారం ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది.

By Medi Samrat  Published on  28 May 2024 12:00 PM IST
విమానం బాత్ రూమ్ లో బాంబు అని రాసిన టిష్యూ పేపర్

మంగళవారం ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్స్ ధృవీకరించింది. ప్రయాణీకులందరినీ అత్యవసర ద్వారాల నుండి ఖాళీ చేయించారు. తనిఖీ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో, "ఢిల్లీ నుండి వారణాసికి నడుపుతున్న ఇండిగో ఫ్లైట్ 6E2211 ఢిల్లీ విమానాశ్రయంలో బాంబు బెదిరింపును అందుకుంది. అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లు తీసుకున్నాం. విమానాశ్రయ భద్రతా ఏజెన్సీల మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని రిమోట్ బేకు తీసుకెళ్లారు." అని తెలిపింది. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా సురక్షితంగా ఖాళీ చేయించామని.. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉందని అధికారులు తెలిపారు. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచనున్నారు.


ఉదయం 5.35 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. ఒక సీనియర్ CISF అధికారి ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ.. విమానం లావేటరీలో "బాంబు" అని రాసిన టిష్యూ పేపర్ కనుగొన్నారు. దీంతో భద్రతా ఏజెన్సీలు తనిఖీ చేయాలని సిద్ధమయ్యారు. అయితే అది బూటకమని తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం విమానాన్ని పరిశీలించేందుకు ఏవియేషన్ సెక్యూరిటీ టీమ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సైట్‌లో ఉన్నాయి.

Next Story