దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం శనివారం నుంచి ఒక వారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి పాఠశాలలను మూసివేశారు. కాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతులకు సంబంధించిన టర్మ్-1 బోర్డు పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని 2,100 సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి టర్మ్-1 బోర్డ్ పరీక్షలను నిర్వహించనున్నాయి. ఏడాదిన్న సుదీర్ఘ విరామం తర్వాత, 9-12 తరగతుల పాఠశాలలు సెప్టెంబర్ 2021లో పునఃప్రారంభించబడ్డాయి.
ఇందులో తల్లిదండ్రుల సమ్మతితో గ్రేడ్‌ల కోసం ఆఫ్‌లైన్ తరగతులను పునఃప్రారంభించాలని పాఠశాలలకు సూచించబడింది. మహమ్మారి కరోనా, కాలుష్య సంక్షోభాలు రెండూ విద్యార్థుల విద్యపై ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. ఈ క్రమరాహిత్యం కారణంగా విద్యార్థులు తమ చదువులపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. ఇది దీర్ఘకాలంలో వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఉత్సహంగా జరుపుకోవాలనుకున్న విద్యార్థులు.. ఇప్పుడు మళ్లీ వర్చువల్‌గా జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది విద్యార్థులకు చాలా నిరాశ కలిగించింది.