ఢిల్లీ పోలీసులు తన దుస్తులు చించేశారని అంటున్న మహిళా ఎంపీ

"Delhi Police Tore My Clothes" Shashi Tharoor Shares Woman MP's Video.కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 2:09 PM IST
ఢిల్లీ పోలీసులు తన దుస్తులు చించేశారని అంటున్న మహిళా ఎంపీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఢిల్లీ పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ మహిళా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి పోలీసులు తనపై దాడి చేసి, దుస్తులు చించేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఢిల్లీ పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారన్న ఎంపీ జ్యోతిమణి.. బూట్లను లాగేసి, దుస్తులు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, కొనుక్కునేందుకు షాపుకు వెళ్తే వారినీ బెదిరించారని చెప్పుకొచ్చారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు.

'ఏ ప్ర‌జాస్వామ్య దేశంలోనైనా ఇది అత్యంత దారుణ‌మైన ఘ‌ట‌న‌. మ‌హిళా నిర‌స‌న‌కారుల‌తో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌తి భార‌తీయుడి మ‌ర్యాద‌కు భంగం క‌లిగించిన‌ట్లే. ఇప్పుడు ఒక లోక్ స‌భ ఎంపీకి ఇలా జ‌ర‌గ‌డం మ‌రింత ఘోరం. ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ఎవ‌రు బాధ్య‌త తీసుకుంటారు. స్పీక‌ర్ జీ.. ద‌య‌చేసి దీనిపై చ‌ర్య‌లు తీసుకోండి' అని థ‌రూర్ రాసుకొచ్చారు.

Next Story