దేశ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ

Delhi lifts weekend curfew. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం మార్కెట్‌లోని దుకాణాలకు వారాంతపు కర్ఫ్యూ, బేసి-సరి నిబంధనను ఎత్తివేయాలని

By అంజి  Published on  27 Jan 2022 6:03 PM IST
దేశ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. కానీ

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం మార్కెట్‌లోని దుకాణాలకు వారాంతపు కర్ఫ్యూ, బేసి-సరి నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు. ఉదయం 5 గంటల వరకు దేశ రాజధానిలో ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. అంతకుముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన జరిగిన డిడిఎంఎ సమావేశం తరువాత నియంత్రణలను సడలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజధాని నగరంలో బార్లు, రెస్టారెంట్లు, సినిమా 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరవబడతాయి. అయితే ప్రస్తుతానికి విద్యాసంస్థలు మూసివేయబడతాయి. పాఠశాలల పునఃప్రారంభంపై తదుపరి డీడీఎంఏ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

దేశ రాజధాని నగరంలో ప్రభుత్వ కార్యాలయాలను 50 శాతం సామర్థ్యంతో ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. డీడీఎమ్‌ఏ దేశ రాజధానిలో వివాహ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను 200కి పరిమితం చేసింది. నగరంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, నగరంలో కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ గురువారం తెలిపారు. ఈ సాయంత్రం నాటికి దేశ రాజధానిలో 5,000 కంటే తక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

మంగళవారం నమోదైన 6,028 కేసులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 7498 కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజా కోవిడ్ ఇన్ఫెక్షన్ 18,10,997కి చేరుకుంది. అదే సమయంలో, 29 మరణాలు కూడా నమోదయ్యాయి, బుధవారం నాటికి మరణాల సంఖ్య 25,710కి చేరుకుంది.

Next Story