అగ్నిపథ్‌కు తొలగిన అడ్డంకులు
Delhi High Court upholds Centre's Agnipath Scheme. సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని
By M.S.R Published on 27 Feb 2023 11:09 AM GMTసాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. గతేడాది డిసెంబర్‌లో ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అగ్నిపథ్ స్కీమ్‌ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదిక కేంద్రం తీసుకున్న విధానమని హైకోర్టు పేర్కొంది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. రిక్రూట్‌మెంట్ స్కీమ్‌లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదని హైకోర్టు పేర్కొంది.
అగ్నివీర్ కు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఎంతో మంది ఆర్మీలో చేరాలని అనుకుంటూ ఉండగా.. కేవలం కొన్ని సంవత్సరాలే ఉద్యోగం అని కేంద్రం చెప్పడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే రక్షణ రంగ నియామకంలో అతిపెద్ద మార్పులలో అగ్నిపథ్ పథకం ఒకటని కేంద్రం చెప్పింది. సాయుధ దళాల సిబ్బందిని నియమించే విధానంలో ఒక సమూలమైన మార్పును తీసుకురాబోతున్నామని.. అగ్నివీర్లకు ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.