ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను మనీలాండరింగ్ కేసులో జూన్ 9 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపుతూ మంగళవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ కేసులో జైన్‌ను ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. జైన్ బంధువులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అటాచ్ చేసింది.
సత్యేంద్ర జైన్ బంధువులైన స్వాతి జైన్, సుశీలా జైన్, ఇందు జైన్‌లకు చెందిన వివిధ సంస్థలకు చెందిన రూ. 4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేశారు. JJ Ideal Estate Pvt. Ltd అనే సంస్థలపై చర్య కూడా తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఇదిలావుంటే.. మనీలాండరింగ్ కేసును ప్రస్తావించిన ఢిల్లీ బీజేపీ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిత్యం అవినీతిపై వ్యాఖ్యానించే ఆమ్ ఆద్మీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ వైఖరి.. ఆరోగ్య మంత్రి అవినీతిని క్షమించడమే కాకుండా, అందులో ఆయన పాలుపంచుకున్నట్లు కూడా ఉందని ఆరోపణలు గుప్పించారు.