ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

By Medi Samrat  Published on  19 Nov 2024 4:17 PM IST
ఢిల్లీకి కృత్రిమ వర్షం కావాలి..!

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉత్తర భారతదేశాన్ని పొగ పొరలు కప్పేశాయని, ఇందులో నుండి బయట పడాలంటే కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారమన్నారు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ అని మంత్రి తెలిపారు. కృత్రిమ వర్షంపై ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లేఖలు పంపినప్పటికీ ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

దేశ రాజధానిని పొగమంచు దట్టంగా కమ్ముకున్నాయి. ఢిల్లీ దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా నిలిచిందని మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కి చేరుకుంది. ఢిల్లీలో కఠినమైన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV పరిమితులను అమలు చేసినప్పటికీ, అనేక ఎయిర్ మానిటరింగ్ స్టేషన్ల వద్ద 500 మార్కును తాకాయి.

Next Story