అక్టోబర్ 20న దీపావళి సందర్భంగా ఢిల్లీలో మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రాజధానిలో ఎటువంటి మద్యం షాపులను తెరవకూడదని స్పష్టం చేసింది. పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం విక్రయదారులందరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పండుగ వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు ఢిల్లీలో ఏటా పండుగల సమయంలో మద్యం అమ్మకాలను నిషేధించే ఆనవాయితీ కొనసాగుతుండటం గమనార్హం. పౌరులు కూడా ఈ నిబంధనను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.