ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా ఏప్రిల్ 5 వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఏప్రిల్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో ED రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. మనీష్ సిసోడియాను బుధవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కోర్టు 2023 ఏప్రిల్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
ఇదిలా ఉండగా.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని మతపరమైన, ఆధ్యాత్మిక పుస్తకాలను తీసుకెళ్లడానికి అనుమతించాలని మనీష్ సిసోడియా కోర్టును కోరారు. దీనిపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గీత, ఇతర పుస్తకాలను తీసుకెళ్లేందుకు సిసోడియాను అనుమతించింది. మనీష్ సిసోడియా ఇప్పటికే లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో కస్టడీలో ఉన్నారు. మార్చి 20 సోమవారం సీబీఐ కేసులో రోస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.