కోర్టు ముందు మూడు డిమాండ్లు ఉంచిన చైతన్యానంద

లైంగిక వేధింపులు, వేధింపులు, మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలపై అరెస్టు అయిన‌ చైతన్యానంద్ అలియాస్ పార్థసారథిని పాటియాలా హౌస్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 5:36 PM IST

కోర్టు ముందు మూడు డిమాండ్లు ఉంచిన చైతన్యానంద

లైంగిక వేధింపులు, వేధింపులు, మోసం, ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలపై అరెస్టు అయిన‌ చైతన్యానంద్ అలియాస్ పార్థసారథిని పాటియాలా హౌస్‌లోని మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఐదు రోజుల పోలీసు రిమాండ్‌ పూర్తికావడంతో నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనిమేష్‌ కుమార్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఆరోపణలు చాలా తీవ్రమైనవని, సాక్ష్యాలను తారుమారు చేయకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా నిరోధించడానికి నిందితుడిని జైలుకు పంపడం అవసరమని ఢిల్లీ పోలీసులు చైతన్యానంద్‌ను జ్యుడీషియల్ కస్టడీకి కోరారు.

నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, నకిలీ విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కార్డులలో అతడు తనను తాను ఐక్యరాజ్యసమితి (UN)కి శాశ్వత రాయబారిగా, బ్రిక్స్ జాయింట్ కమిషన్ సభ్యుడిగా, భారత్ యొక్క ప్రత్యేక రాయబారిగా పేర్కొన్నాడు.

అదే సమయంలో చైతన్యానంద తరపున కోర్టులో మూడు దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో సీజ్ మెమోరాండం, కేసు డైరీపై సంతకం, సన్యాసి ఆహారం, సన్యాసి దుస్తులు, మందులు, పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కోర్టులో తన సమాధానాన్ని దాఖలు చేశారు.

సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి ఆగ్రాలోని ఓ హోటల్‌లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చైతన్యానందను అరెస్టు చేశారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో చాలా రోజులుగా చైతన్యానంద పోలీసులకు చిక్కకుండా తలదాచుకున్నాడు. అరెస్టుకు ముందు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

సెప్టెంబర్ 23న నిందితుడిపై వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. చైతానంద అసభ్యకరమైన సందేశాలు పంపాడని, అతనిని వేధించాడని, లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, దుర్భాషలాడాడని ఆర్థికంగా బలహీనమైన విభాగం (ఈడబ్ల్యుఎస్) విద్యార్థులు అతనిపై ఆరోపణలు చేశారు.

ఫిర్యాదుదారుల ప్రకారం.. బాలికలను అదుపులో ఉంచడానికి వారి ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, విద్యార్హత పత్రాలను తీసుకున్నాడు. అలాగే విదేశాల్లో ప్లేస్‌మెంట్‌ ఇప్పిస్తానని చెప్పి దోపిడీకి పాల్పడ్డారు.

శృంగేరి శ్రీ శారదా పీఠానికి చెందిన నిధులను కూడా నిందితులు పక్కదారి పట్టించి సమాంతర ట్రస్టు ద్వారా సుమారు రూ.20 కోట్లను మళ్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాదాపు రూ.55 లక్షలు దుర్వినియోగం అయినట్లు సమాచారం.

అంతకుముందు సెప్టెంబర్ 26న నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని అదనపు సెషన్స్ జడ్జి హర్దీప్ కౌర్ తెలిపారు.

Next Story