ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాను ఢిల్లీలోని రోజ్ ఎవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 26న వాదనల అనంతరం చౌతాలాకు శిక్ష విధించనుంది. 1993-2006 మధ్య చౌతాలా తన ఆదాయానికి మించి రూ. 6.09 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ 26 మార్చి 2010న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి వికాస్ ధుల్ ఉత్తర్వులు జారీ చేసి, మే 26వ తేదీకి వాయిదా వేశారు, కోర్టు శిక్ష విషయంపై వాదనలు వింటుంది. దీనిపై CBI 2005లో కేసు నమోదు చేసింది.
1993 మరియు 2006 మధ్య కాలంలో చౌతాలా తన చట్టబద్ధమైన ఆదాయానికంటే ఎక్కువగా రూ. 6.09 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ మార్చి 26, 2010లో ఛార్జ్ షీట్ దాఖలు చేయబడింది. ఇదే కేసుకు సంబంధించి జనవరి 2021లో చౌతాలాపై మనీలాండరింగ్ అభియోగాలు కూడా నమోదయ్యాయి. 2013లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో దోషిగా తేలిన చౌతాలా, ఆయన కుమారుడు అజయ్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 87 ఏళ్ల చౌతాలా గతేడాది జులైలో జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఏ శిక్ష విధిస్తుందోనని ఆయన అనుచరుల్లో టెన్షన్ మొదలైంది.