దొంగతనం అనుమానంతో విద్యార్థినిలను వేధించిన వార్డెన్.. బట్టలు విప్పించి మరీ..
దొంగతనం చేశారనే అనుమానంతో నర్సింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను హాస్టల్ వార్డెన్ వేధింపులకు గురిచేసినట్లు
By అంజి Published on 4 May 2023 10:30 AM ISTదొంగతనం అనుమానంతో విద్యార్థినిలను వేధించిన వార్డెన్.. బట్టలు విప్పించి మరీ..
ఢిల్లీ: దొంగతనం చేశారనే అనుమానంతో నర్సింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను హాస్టల్ వార్డెన్ వేధింపులకు గురిచేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో, ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలోని అహల్యాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సింగ్ విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించిన సంఘటనకు సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి బుధవారం తెలిపారు. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఇతర విద్యార్థులు, వార్డెన్‌తో కలిసి మండి హౌస్ ప్రాంతంలో కమ్యూనిటీ కార్యక్రమానికి వెళ్లినట్లు విచారణలో తేలింది.
అయితే అక్కడ వార్డెన్ తన బ్యాగ్‌లో రూ. 8,000 కనిపించకుండా పోయాయని, ఈ ఇద్దరు విద్యార్థులే ఆ దొంగతనం చేసినట్లు అనుమానించారని అధికారి తెలిపారు. ఇతర విద్యార్థుల సహాయంతో వార్డెన్ ఆ ఇద్దరు విద్యార్థినుల బట్టలు విప్పించి చెక్ చేయించారు. అయినా వారి వద్ద ఎలాంటి డబ్బు కనిపించలేదు. ఘటన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. బాలికలను వివస్త్రను చేశారని వారు ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణ తర్వాత ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 (స్త్రీపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిందని. ఈ కేసును తిలక్ మార్గ్ పోలీసులకు బదిలీ చేస్తామని వారు తెలిపారు. ప్రిన్సిపాల్ మరియు ఇతర సీనియర్ అధ్యాపకులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని కళాశాల అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిందని, వార్డెన్‌ను హాస్టల్ నుండి తరలించినట్లు పోలీసులు తెలిపారు.