Video : అధిక‌ ఫీజులు వ‌సూలుపై సీఎంకు ఫిర్యాదు చేసిన‌ తల్లిదండ్రులు.. రియాక్ష‌న్ ఇక్క‌డ చూడండి..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపిస్తున్నారు.

By Medi Samrat
Published on : 15 April 2025 3:21 PM IST

Video : అధిక‌ ఫీజులు వ‌సూలుపై సీఎంకు ఫిర్యాదు చేసిన‌ తల్లిదండ్రులు.. రియాక్ష‌న్ ఇక్క‌డ చూడండి..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపిస్తున్నారు. జన్‌సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మోడల్‌ టౌన్‌లోని క్వీన్‌ మేరీ స్కూల్‌లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిసి అధిక‌ ఫీజులు వసూలు చేయడం, పిల్లలను పాఠశాల నుంచి బహిష్కరించడంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి వెంట‌నే స్పందించారు. త‌క్ష‌ణ‌మే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైర‌ల్ అవుతుంది.

వీడియోలో ముఖ్య‌మంత్రి.. క్వీన్ మేరీ స్కూల్ మోడల్ టౌన్ యాజ‌మాన్యాన్ని ఈ రోజే సెక్రటేరియేట్‌కు పిలవండి. వారికి చెప్పండి.. మేము వారి రిజిస్ట్రేషన్‌ని రద్దు చేయబోతున్నాం.. కాల్ చేసి ఈ మెసేజ్‌ వారికి చేర‌వేయండి అంటూ విద్యాశాఖ సీనియర్‌కు మొబైల్ ఫోన్‌లో సూచన చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

విద్యారంగంలో పారదర్శకత, సమాన అవకాశాలు, బాలల హక్కుల పరిరక్షణకు ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, నాణ్యమైన విద్య అందాలనే మా సంకల్పం స్పష్టంగా ఉందన్నారు.

మోడల్ స్కూల్ ఏరియా ఎమ్మెల్యే అశోక్ గోయల్ దేవ్రాహా మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో గత మూడేళ్లుగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారన్నారు. తల్లిదండ్రులు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు.


Next Story