Delhi Blast : యూఏపీఏ, ఎక్స్‌ప్లోసివ్‌ చట్టాల కింద కేసు నమోదు

రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA-ఉఫా) కింద కేసు నమోదు చేశారు.

By -  Medi Samrat
Published on : 11 Nov 2025 9:57 AM IST

Delhi Blast : యూఏపీఏ, ఎక్స్‌ప్లోసివ్‌ చట్టాల కింద కేసు నమోదు

రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA-ఉఫా) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దాడిలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు నిర్ధారించారు.

ఎర్రకోట పేలుడు కేసులో ఢిల్లీ పోలీసులు UAPA, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ నార్త్ మీడియాకు తెలిపారు. పోలీసులు ప్రతి కోణంలోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు లోక్‌నాయక్‌ ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన అత్యవసర ద్వారం మూసివేయబడింది. క్షతగాత్రులను ఈ ఆసుపత్రిలో చేర్పించారు.

అస‌లేం జ‌రిగింది..?

సోమవారం సాయంత్రం 6:52 గంటలకు పేలుడు సంభవించింది

14 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో పేలుడు సంభవించింది. గతంలో 2011లో హైకోర్టు గేటు దగ్గర పేలుడు సంభవించింది.

పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలుగు కిలోమీటర్ల వరకు శబ్ధం వినిపించింది.

పేలుడు జరిగిన హర్యానా నంబర్ ఐ-20 కారు పదే పదే విక్రయించబడింది.

ఘటనా స్థలానికి 250 మీటర్ల దూరంలో కారు భాగాలు పడిపోయాయి.

ఎర్రకోట ఎదురుగా ఉన్న చాందినీ చౌక్ వైపు పలు దుకాణాల అద్దాలు పగులగొట్టారు.

పేలుడు తీవ్రత, శిధిలాల స్వభావం.. పేలుడు పదార్ధం అధిక తీవ్రతతో ఉన్నట్లు సూచిస్తున్నాయి.

RDX ఇందులో ఉపయోగించబడి ఉండవచ్చు.. సాధారణ ఇంధనం లీకేజీ కారణంగా జ‌రిగిన పేలుడు కాదని ద‌ర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story