గంభీర్ ను బెదిరిస్తూ ఈమెయిల్స్ వచ్చింది ఆ దేశం నుండే..!

Death threat e-mails received by gambhir traced to pak. మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఈ మెయిల్స్‌ రూపంలో ఐఎస్ఐఎస్‌ కశ్మీర్ నుండి బెదిరింపులు వచ్చాయని గౌతం గంభీర్‌ చెప్పారు.

By అంజి  Published on  25 Nov 2021 12:00 PM GMT
గంభీర్ ను బెదిరిస్తూ ఈమెయిల్స్ వచ్చింది ఆ దేశం నుండే..!

మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఈ మెయిల్స్‌ రూపంలో ఐఎస్ఐఎస్‌ కశ్మీర్ నుండి బెదిరింపులు వచ్చాయని గౌతం గంభీర్‌ చెప్పారు. మంగళవారం రాత్రి గంభీర్‌ ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు. ముప్పు ఉన్న నేపథ్యంలో తగిన భద్రత ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో తన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గౌతమ్ గంభీర్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఫిర్యాదు ఇచ్చారని, పోలీసులు చర్యలు చేపట్టారని, తాము దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ సెంట్రల్‌ డీసీపీ శ్వేతా చౌహాన్‌ పేర్కొన్నారు. ఈ మెయిల్‌ అడ్రస్‌ను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం గంభీర్ కు మెయిల్ పంపించిన ఖాతా హ్యాండ్లర్‌ను సాహిద్ హమీద్‌గా గుర్తించారు. అది పాకిస్తాన్ నుండి వచ్చిన ఈమెయిల్ గా కూడా గుర్తించారు. 'ఐఎస్‌ఐఎస్‌ కాశ్మీర్‌' నుంచి 24 గంటల్లోనే తనకు ఈ-మెయిల్స్‌ ద్వారా రెండు మరణ బెదిరింపులు వచ్చాయని బీజేపీ ఎంపీ తెలిపారు. "We are going to kill you and your family," అని మొదటి ఈమెయిల్ లో రాగా.. "We intended to kill you, but you survived yesterday. If you love the life of your family, stay away from politics and the Kashmir issue." అంటూ రెండో ఈమెయిల్ లో వచ్చింది.

ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు కూడా గంభీర్ ఫిర్యాదు మెయిల్ యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి సైబర్ సెల్‌కు సమాచారం అందించారు. ఖాతా హ్యాండ్లర్‌ను సాహిద్ హమీద్‌గా గుర్తించారు. అతడిది పాకిస్తాన్ అని తెలుసుకున్నారు.

Next Story