ఆండ్రాయిడ్ యూజర్స్‌ జాగ్రత్త పడండి.. వెంటనే ఆ యాప్‌ను తొలగించండి

DANGEROUS Google Play Store app BANNED due to Joker Malware, delete from phone now. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా.. వెంటనే అలర్ట్‌ అవ్వండి. జోకర్‌ మాల్వేర్ ఉన్న ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే వెంటనే చెక్

By అంజి  Published on  20 Dec 2021 10:56 AM GMT
ఆండ్రాయిడ్ యూజర్స్‌ జాగ్రత్త పడండి.. వెంటనే ఆ యాప్‌ను తొలగించండి

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా.. వెంటనే అలర్ట్‌ అవ్వండి. జోకర్‌ మాల్వేర్ ఉన్న ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే వెంటనే చెక్ చేసుకోని డిలీట్‌ చేయండి. లేదంటే మీ ఫోన్‌ సైబర్‌ నేరస్థుల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ మేరకు ఆండ్రాయి్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్స్‌కు టెక్‌ దిగ్గజం గూగుల్‌ కీలక సూచన చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో కలర్‌ మెసేజ్‌ పేరుతో ఉన్న మెసేజింగ్ యాప్‌ ఒకటి ఉంది. ఈ యాప్‌ను సుమారు 5 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ఈ యాప్‌లో జోకర్ మాల్‌వేర్ ఉన్నట్లు ప్రాడియో సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. కాగా వెంటనే ఆ యాప్‌ను యూజర్స్‌ తమ స్మార్ట్‌ఫోన్ల నుండి చేయాలని గూగుల్‌ సూచించింది.

" గూగుల్‌ ప్లేస్టోర్‌లో కలర్‌ మెసేజ్‌ యాప్‌ ఉంది. ఇది కొత్త ఎమెజీలతో చాటింగ్‌కి కొత్త అనుభూతిని కల్గిస్తుందని, సెక్యూరిటీ ఫీచర్స్‌ పరంగా కూడా ఎంతో సురక్షితమైందని యాప్‌ డెవలపర్స్‌ పేర్కొన్నారు." అయితే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారి ఫోన్లలోకి జోకర్‌ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రాడియో సంస్థ తెలిపింది. ఈ మాల్వేర్‌ ద్వారా యూజర్‌ ప్రమేయం లేకుండా ప్రీమియం సేవలకు సంబంధించిన సర్వీసుల సబ్‌స్క్రైబ్‌, బ్యాంకింగ్‌ వివరాలు బహిర్గతం అవుతున్నాయట. దీని ద్వారా పర్సనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ కూడా హ్యాకర్స్‌ చేతిలోకి వెళ్తోందని సదరు సంస్థ వెల్లడించింది.

అయితే ఇప్పటికే కలర్‌ మెసేజ్‌ యాప్‌ను ప్లేస్టోర్‌లో నిషేధించినట్లు గూగుల్‌ తెలిపింది. ఈ సందర్భంగా యాప్‌ను డిలీట్‌ చేయడంతో పాటు మరో ప్రక్రియ కూడా చేయాలని గూగుల్‌ పేర్కొంది. కలర్ మెసేజ్ యాప్ విషయంలో వలె, మాల్వేర్ కారణంగా మీరు రహస్యంగా సైన్ అప్ చేసిన సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేయడానికి అన్‌ఇన్‌స్టాల్ చేయడం సరిపోదు. దాని కోసం మీరు గూగుల్‌ ప్లే స్టోర్‌ని మళ్లీ తెరిచి, మెనూలోని సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్లాలి. మీరు సైన్ అప్ చేసిన అన్ని ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లను తనిఖీ చేయండి, వాటిలో ఏవైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, దాన్ని ఎంచుకుని, ఆపై సభ్యత్వాన్ని రద్దు చేయండి. అప్పుడు మీరు ఆన్-స్క్రీన్ దిశలను అనుసరించాలి. అప్పుడే మీ ఫోన్ నుంచి కలర్‌ మెసేజ్‌ను పూర్తిగా తొలగించినట్లని ప్రాడియో సంస్థ తెలిపింది.

Next Story