భ‌యంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు.. 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు

Curfew In Jharkhand Block After Elephant Kills 16 People In 12 Days.జార్ఖండ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు ఏనుగు పేరు చెబితేనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2023 9:48 AM IST
భ‌యంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు.. 12 రోజుల్లో 16 మందిని చంపిన ఏనుగు

జార్ఖండ్ రాష్ట్రంలోని ప్ర‌జ‌లు ఏనుగు పేరు చెబితేనే వ‌ణికిపోతున్నారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు 12 రోజుల్లో 16 మందిని ఓ ఏనుగు చంప‌డ‌మే అందుకు కార‌ణం. మంగ‌ళ‌వారం ఒక్క రాంచీ జిల్లాలోనే న‌లుగురిని చంపింద‌ని అటవీ అధికారులు తెలిపారు. దీంతో ఎప్పుడు, ఏ స‌మ‌యంలో ఎటు వైపు నుంచి ఏనుగు దాడి చేస్తుందోన‌ని స్థానిక ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఇట‌కీ బ్లాకులో 144 సెక్ష‌న్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడ‌వ‌ద్ద‌ని తెలిపారు. ముఖ్యంగా సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యం స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనే ఉండాల‌ని సూచిస్తున్నారు.

హజారీబాగ్, రామ్‌గఢ్, ఛత్రా, లోహర్‌దగా మరియు రాంచీ జిల్లాల్లో 16 మందిని చంపినట్లు అనుమానిస్తున్న ఏనుగును ప‌ట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిపుణుల బృందాన్ని నియమించడంతో పాటు అటవీ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శశికుమార్ సామంత తెలిపారు. ఏనుగు దాడిలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story