ఎయిర్‌పోర్ట్‌లో AMSS సిస్టమ్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై సభలో చర్చ
రాజ్యసభలో శుక్రవారం విమానయాన రంగంలోని అవ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By - Knakam Karthik |
ఎయిర్‌పోర్ట్‌లో AMSS సిస్టమ్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై సభలో చర్చ
ఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం విమానయాన రంగంలోని అవ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 7–8 తేదీల్లో జరిగిన AMSS (ఆటోమేటిక్ మెసేజింగ్ సర్వీసెస్ సిస్టమ్) వైఫల్యం కారణంగా విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని సభ్యులు ఆరోపించారు.
సభలో మాట్లాడిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్ ,“ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. జులైలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ప్రభుత్వంను హెచ్చరించింది—సిస్టమ్ పాతబడిపోయింది, ఆధునీకరణ అవసరం ఉంది అని. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే నవంబర్‌లో వ్యవస్థ పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు. ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ..“సిస్టమ్ పూర్తిగా ఆగలేదు… కేవలం ఆలస్యం మాత్రమే” ఇందుకు సమాధానంగా సివిల్ ఏవియేషన్ మంత్రి తెలిపారు. సమస్య నవంబర్ 6న గుర్తించబడిందని, ఈ AMSS సిస్టమ్‌ను నిర్వహించే Airport Authority of India (AAI) తక్షణమే లోపాన్ని గుర్తించిందని చెప్పారు. సిస్టమ్ పూర్తిగా పనిచేయలేదు అనడం తప్పుడు. సందేశాల ప్రాసెసింగ్ వేగం తగ్గడం (latency) వల్ల ఆలస్యాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. సిస్టమ్ 2020లో ఏర్పాటు చేయబడిందని, దీనికి ECIL సంస్థ మెంటెనెన్స్ చేస్తున్నదని తెలిపారు. లోపం బయటపడిన వెంటనే బ్యాకప్ సిస్టమ్‌ను అమలు చేశాము. 36 గంటల్లో ప్రధాన వ్యవస్థను మళ్లీ సక్రమంగా తీసుకువచ్చామని తెలిపారు. అంతేకాక, లోపం ఉన్న వ్యవధిలో ATCల్లో అదనపు సిబ్బందిని పెట్టి మాన్యువల్ విధానంలో మెసేజింగ్ నిర్వహించామని మంత్రి స్పష్టం చేశారు. “ఈ AMSS సమస్య కారణంగా ఏ విమానమూ రద్దు కాలేదు, కేవలం ఆలస్యాలు మాత్రమే జరిగాయి” అని మంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సభలో ఇంకా అనుబంధ ప్రశ్నలు లేవనెత్తగా, విమానయాన రంగంలో భద్రత, సాంకేతిక సదుపాయాల ఆధునీకరణపై ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపించింది.